Sixes practice Chennai batters: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2025 ఐపీఎల్ లో పూర్తిగా ఢీలా పడిపోయింది. బ్యాటర్లు ఫామ్ కోల్పోయారు. బౌలింగ్ విభాగం పేలవంగా మారిపోయింది. దోని (Mahendra Dhoni) పెద్ద హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే ఆడటం లేదు. ఇటు అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ లో మునుపటి ఫామ్ చూపించలేకపోతున్నారు. ఇలా అన్నీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రతికూలంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) సరికొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. ఇప్పటికే అయిదు మ్యాచుల్లో నాలుగు ఓడి ఒక దాంట్లో గెలిచిన చెన్నైను తిరిగి గాడిలో పెట్టేందుకు సరికొత్త ట్రైనింగ్ సెషన్ ప్రారంభించాడు.
సిక్సులు కొట్టేలా ట్రైనింగ్..
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) ఆడిన అయిదు మ్యాచుల్లో కేవలం 32 సిక్సులు మాత్రమే కొట్టింది. ఇదే ఈ సీజన్ లో తక్కువ సిక్సులు కొట్టిన జట్టు కావడం విశేషం. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఒక్క మ్యాచులోనే మొత్తం 30 సిక్సులకు పైగా బాదారు. అలాంటిది చెన్నైఅయిదు మ్యాచులు ఆడి కేవలం 32 సిక్సులు కొట్టడం వెనక ఓటములు ఉన్నాయని కోచ్ భావించాడు. దీంతో చెన్నై ఆటగాళ్లను సిక్సులు కొట్టడం ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. సిక్సులు బాదడం స్టార్ట్ చేస్తే ప్రత్యర్థి బౌలర్లను ఈజీగా భయపెట్టొచ్చు. చెన్నై లో మహేంద్ర దోని ఈజీగా సిక్సులు కొట్టేయగలడు. మరో బ్యాటర్ శివమ్ దూబె కూడా ఈజీగా దంచేస్తాడు. కాబట్టి వీరికి ప్రాక్టీస్ చేయిస్తే చాలు సిక్సులతో ప్రత్యర్థులను భయపెట్టొచ్చు అని అనుకుంటున్నారు.
Sixes practice Chennai batters: పాత చెన్నై సూపర్ కింగ్స్ ను చూస్తామా?
వీరిద్దరూ కాకుండా రవీంద్ర జడేజా (Ravindra Jadeja), రచిన్ రవీంద్ర ఇద్దరూ కూడా భారీ సిక్సర్లు బాదగలరు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే కూడా ఈజీగా ఆడగలరు. కానీ వీరెవరూ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. దీంతో చెన్నై కోచ్ ఓ నిర్ణయం తీసుకుని సిక్సులు కొట్టే ట్రైనింగ్ సెషన్ నిర్వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్ లో మ్యాచ్ లో చెన్నై ఆటగాళ్లు మరీ సిక్సులు బాదడంలో సఫలమవుతారా.. పాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు