Delhi Capitals won: ఢిల్లీ క్యాపిటల్స్ Delhi Capitals, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది. సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ బ్యాటర్లను 11 పరుగులకే కట్టడి చేసింది. తర్వాత నాలుగు బంతులే ఆడి మ్యాచ్ ను ఫినిష్ చేసి మళ్లీ పాయింట్స్ టేబుల్స్ లో మొదటి స్థానంలో నిలిచింది.
మొదట్లో కట్టడి బాగానే చేసినా..
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కెప్టెన్ సంజు శాంసన్ అనుకున్నట్లు మొదట్లో ఢిల్లీని బాగానే కట్టడి చేశాడు. చివరి 5 ఓవర్లలోనే అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్(Tristan Stubbs), అశుతోష్ శర్మ ఫోర్లు, సిక్సర్లు బాదడంతో 188 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ప్రెజర్ మెక్ గుర్క్ సింగిల్ డిజిట్ కే పరిమితమైనా మరో ఓపెనర్ అభిషేక్ పొరెల్ దంచి కొట్టాడు. 37 బంతుల్లోనే 49 పరుగులు చేసి అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) నెమ్మదిగా ఆడటంతో మధ్యలో స్కోరు వేగం తగ్గినా.. చివర్లో అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ గౌరవప్రదమైన స్కోరును అందించారు.
దంచి కొట్టిన రాజస్థాన్ బ్యాటర్లు

రాజస్థాన్ బ్యాటర్లు సంజు శాంసన్ (Sanju Samson), యశస్వి జైశ్వాల్ ఇద్దరు ఢిల్లీ బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. దీంతో మొదటి ఆరు ఓవర్లలో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ నితీశ్ రానా కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్ 18 ఓవర్ లో యార్కర్ వేయడంతో ఎల్బీగా వెనుదిరిగాడు. చివరి ఓవర్ లో 9 పరుగులు కావాల్సిన సమయంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఎనిమిది పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.
Delhi Capitals won చివరకు ఏమైందంటే
ఐపీఎల్ లో చివరి సారి 2021 లో ఎస్ఆర్ హెచ్, ఢిల్లీ మధ్య మ్యాచు టైగా ముగిసింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ లో మ్యాచ్ టై (match tie) గా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. ప్రస్తుతం 18 వ ఐపీఎల్ సీజన్ నడుస్తుండగా.. 15 మ్యాచులు టైగా ముగిశాయి. అంటే ఎంతలా ఐపీఎల్ లో ఉత్కంఠగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.