Abishek Nair: టీం ఇండియా సహాయక కోచ్ పదవి నుంచి అభిషేక్ నాయర్ ఔట్

Abishek Nair: భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ (Assistant Coach Team India) పదవి నుంచి అభిషేక్ నాయర్ ను బీసీసీఐ తొలగించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్‌ల్లో భారత్‌ ఓటములే కారణమని చూపుతూ నాయర్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే క్రికెట్ టీంలోని కోచ్ సిబ్బందిలోని కీలక వ్యక్తితో ఆయన కు విభేదాలు రావడం వల్లే అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం

అభిషేక్ నాయర్ (Abhishek Nair) ను తొలగిస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐ అతడికి సమాచారాన్ని అందించింది. అయితే అభిషేక్ స్థానంలో సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాంషు కోటక్ ను బ్యాటింగ్ కోచ్ గా తీసుకొచ్చారు. అభిషేక్ నాయర్ విషయంలో ఒక్కరూ నిర్ణయం తీసుకోలేదు. దీని గురించి అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో (Rajiv Shukla) పాటు బోర్డు సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Abishek Nair ఎన్నెన్నో అనుమానాలు

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్ గా ఉన్న సమయంలో అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్ గా ఆ టీంకు సేవలు అందించాడు. అందరూ గౌతం గంభీర్ ను కోచ్ గా తీసుకున్న సమయంలో అభిషేక్ ఎంపిక కూడా గౌతమ్ గంభీరే చేశాడని అనుకున్నారు. కానీ రోహిత్ Rohit Sharma తో అభిషేక్ నాయర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ముంబయి జట్టు తరఫున రంజీ మ్యాచులు ఆడారు. దీంతో అతడిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సడెన్ గా అభిషేక్ నాయర్ ను తప్పించడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకు వేటు వేశారో తెలియాల్సి ఉంది

అసలు అభిషేక్ నాయర్ Abhishek Nair కు మరో వ్యక్తి కి ఎక్కడ ఇబ్బంది తలెత్తింది. ఆసీస్, న్యూజిలాండ్ పర్యటనలో జట్టు విఫలమైతే కేవలం సహాయ కోచ్ పై వేటు వేయడం ఎందుకు.. ప్లేయర్లపై వేటు వేయలేదు. కోచ్ పై వేటు పడలేదు. కేవలం అభిషేక్ నాయర్ పైనే ఎందుకు వేటు వేశారనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

అభిషేక్ నాయర్ తో పాటు ఫీల్డింగ్ కోచ్ (Fielding Coach) దిలీప్ కూడా వేటు వేసింది. ఇప్పటికే దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్నాడు. బీసీసీఐ పెట్టిన కండిషన్ ప్రకారం.. మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా కోచ్ గా ఉండరాదు. దీంతో దిలీప్ స్థానంలో లెరౌక్స్ ను ఇండియన్ క్రికెట్ టీంలోకి ఎంపిక చేశారు.

Leave a Comment