Four cricketers in one family: క్రికెట్ అంటే ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత ఎక్కువగా క్రేజ్ ఉన్నగేమ్. ముఖ్యంగా బ్రిటన్ లో పుట్టిన ఈ గేమ్ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ గేమ్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. క్రికెట్ లో ఒకే ఇంటి నుంచి అన్నదమ్ములు ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఒకే కుటుంబం నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహించడం ఇక్కడ విశేషం. అందులో ఇద్దరు జింబాబ్వేకు మరో ఇద్దరు ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సామ్ కరణ్, టామ్ కరణ్ లు ఇంగ్లండ్ కు
ఇంగ్లాండ్ టాప్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు. మరో వైపు టామ్ కరణ్ కూడా ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరఫున ఆడాడు. వీరిద్దరి తమ్ముడు బెన్ కరణ్ కూడా వన్డే క్రికెట్ లో డెబ్యూ చేయబోతున్నాడు. వీరి తండ్రి కెవిన్ కరణ్ జింబాబ్వే క్రికెట్ తరఫున ఆడాడు. ఇప్పుడు చిన్న కొడుకు కూడా జింబాబ్వే తరఫున ఆడుతున్నాడు.
Four cricketers in one family సోదరులైన క్రికెటర్లు వీరే..
ఒకే కుటుంబం నుంచి వచ్చిన నలుగురు క్రికెటర్లు రెండు విదేశీ జట్లకు ఆడటం ఇక్కడ విచిత్రం కాగా.. ఫ్యామిలీ మొత్తం క్రికెట్ కు అంకితమైపోయి గొప్ప స్థాయికి చేరుకోవడం కూడా చాలా అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇలా వీరి ఫ్యామిలీనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒకే కుటుంబం నుంచి చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. అందులో కొన్ని పేర్లను పరిశీలిస్తే.. స్టీవ్ వా, మార్క్ వా ఒకే కుటుంబం నుంచి ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడిన సోదరులు. మరో వైపు ఇండియాలో యూసుప్ పఠాన్, ఇర్పాన్ పఠాన్, హర్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, పాకిస్థాన్ నుంచి కమ్రాన్ అక్మల్, ఉమ్రాన్ అక్మల్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెక్ కల్లమ్, నాథన్ మెక్ కల్లమ్ సోదరులు ఒకే జట్టు తరఫున ఆడారు. ఇలా క్రికెట్ లో ఒకే ఫ్యామిలీ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించడం విశేషం.
టాలెంట్ ఉంటే చాన్సులు
ఈ సోదరుల జంటలు కూడా చాలా విశేషంగా రాణించాయి. ఏదో వచ్చాం ఆడి వెళ్లిపోయామన్నట్లు కాకుండా తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్ లో బాగా రాణిస్తే వారి పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. బోలెడంతా మంది అభిమానులు, అంతకంటే ఎక్కువగా డబ్బు, హోదా కలకలం నిలిచిపోయే పేరు వస్తుంది. క్రికెటర్ గా కావాలంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలి. చాలా మందికి ఎంతో టాలెంట్ ఉన్నా.. నీకన్నా గొప్ప క్రికెటర్లు ఉన్నా వారికి చాన్సులు రావు. కానీ ఎంత ఓపికగా ఉండి.. అంతా బాగా రాణిస్తేనే ఈ రంగంలో రాణించడం సులభమవుతుంది.