Punjab narrow win over RCB: ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జైత్రయాత్ర కొనసాగుతోంది. తక్కువ స్కోరుకే కోల్ కతాను కట్టడి చేసి గెలిచినా పంజాబ్ బాయ్స్.. బెంగళూరులో ఆర్సీబీపై సత్తా చాటారు. వర్షం పడటంతో అంపైర్లు కేవలం 14 ఓవర్లకు మ్యాచును కుదించారు. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. మరీ పేలవంగా ఆడి వికెట్లన పోగొట్టుకున్నారు.
ఆదుకున్న టిమ్ డేవిడ్
విరాట్ కొహ్లీ (Virat Kohli) 1, ఫిల్ సాల్ట్ 4, క్రునాల్ పాండ్యా, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, బండగే అందరూ సింగిల్ డిజిట్ కే పరిమతమయ్యారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 47/7 తో ఢీలా పడిపోగా.. చివర్లో టిమ్ డేవిడ్ అయిదు ఫోర్లు, మూడు సిక్సులతో దంచి కొట్టడంతో చివరకు 95 పరుగులు చేయగలిగింది. టిమ్ డేవిడ్ 50 పరుగులతో రాణించాడు.
Punjab narrow win over RCB: నెహాల్ వదేరా ధనాదన్
అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కూడా కష్టంగానే ఛేజ్ చేసింది. 53 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత వచ్చిన పంజాబ్ బ్యాటర్ నెహాల్ వదేరా (Nehal Vadera) మూడు ఫోర్లు, మూడు సిక్సులతో రాణించి పంజాబ్ కింగ్స్ ను గెలిపించాడు. దీంతో పంజాబ్ మొత్తం ఏడు మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. గతంలో ఎప్పుడు కూడా కింది నుంచి పాయింట్ల పట్టికలో ఉండే పంజాబ్ కింగ్స్ ఈసారి అద్భుతంగా ఆడుతోంది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మాత్రం తన హోంగ్రౌండ్ చిన్న స్వామి స్టేడియంలో వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయింది. బయట గెలుస్తున్నా ఆర్సీబీ హోంగ్రౌండ్ లో ఓడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.