James Anderson: క్రికెట్ అంటే ఎందుకంతా పిచ్చి బాస్ నీకు..

James Anderson: క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లు ఏళ్ల తరబడి ఆడిన వారు ఉన్నారు. అందులో వందల వికెట్ల వీరులు.. టన్నుల కొద్దీ పరుగులు చేసిన వాళ్లు ఉన్నారు. కానీ వారందరూ ఎప్పుడో ఒకప్పుడు రిటైర్డ్ అవ్వక తప్పదు. ఈ ఆటగాడు కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కానీ అతడి మనసు మాత్రం ఇంకా క్రికెట్ ఆడాలని పరితపిస్తూనే ఉంది. అందుకే మళ్లీ లోకల్ మ్యాచులో ఆడే టీంలో 14 మంది జట్టు సభ్యుల్లో ఒకడిగా ఎంపికయ్యాడు. ఇంతకీ ఎవరనీ అనుకుంటున్నారా.. అతడే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పేస్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ (England Cricket Team) తరఫున 700 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ జేమ్స్ అండర్సన్..

James Anderson ఆపద్భాందవుడు జేమ్స్ అండర్సన్..

జేమ్స్ అండర్సన్ (James Anderson) చివరి సారిగా పది నెలల కిందట వెస్టిండీస్ తో మ్యాచులో రిటైర్మెంట్ ప్రకటించి చివరి టెస్ట్ ఆడేశాడు. అప్పుడు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీవీల ముందు కూర్చున్న ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ ఎంతో బాధపడ్డారు. ప్రస్తుతం 43 ఏళ్లు ఉన్న అండర్సన్ ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శం. అప్పటి వరకు ఇంగ్లండ్ బౌలింగ్ ఎదుర్కొంటున్న సమయంలో ఆపద్భాందవుడిలా వచ్చాడు. ఎవరూ కూడా 700 వికెట్ల మైలురాయిని దాటతాడని అనుకోలేదు. ఒక ఇంగ్లిష్ క్రికెటర్ ఇలా మారడం వెనక ఎంతో శ్రమ, పట్టుదల, కృషి ఉన్నాయి

లాంక్ షైర్ (Lancashire)తరఫున

లాంక్ షైర్ (Lancashire)తరఫున 11 మంది జట్టులో జేమ్స్ అండర్సన్ కు స్థానం లభించడం ఖాయం. జూన్ లో 43 ఏళ్లకు చేరుకోనున్న జేమ్స్ అండర్సన్ ప్రస్తుతం 14 మంది జట్టులో సెలెక్ట్ అయ్యాడు. డెర్బీ షైర్ తో (Derbyshire) ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరగబోయే కౌంటీ టెస్ట్ మ్యాచులో ఆడటానికి అంతా రంగం సిద్ధమైపోయింది. ఈ మధ్యనే టెస్ట్ కాలి గాయంలో కోలుకున్న అండర్సన్ ప్రస్తుతం లాంక్ షైర్ తరఫున మరి కొద్ది గంటల్లో ఆడనున్నాడు. దీంతో వరల్డ్ లోని క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఎందుకు బాస్ నీకు క్రికెట్ అంటే అంత పిచ్చి నీకు.. ఇదేంటి ఇంక మరిచిపోవా అంటూ తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Leave a Comment