Ben Stokes ready for reentry: రీ ఎంట్రీకి బెన్ స్టోక్స్ రెడీ

Ben Stokes ready for reentry: ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ క్రికెటర్ బెన్ స్టోక్స్ తన జాతీయ జట్టు (England Cricket Team) తరఫున పునరాగమనం చేసేందుకు రెడీ అయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంలో చాలా రోజులుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న స్టోక్స్ భారత్ తో స్వదేశంలో జరిగే అయిదు టెస్టు మ్యాచుల సిరీస్ కు అందుబాటులో ఉండనున్నట్లు ప్రముఖ ఇంటర్నేషనల్ చానల్ స్కై స్పోర్ట్ కు మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

తిరగబెట్టిన గాయం

గత ఆగస్టులో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన స్టోక్స్ (Ben Stokes).. ఆ తర్వాత పాకిస్థాన్ తో గత అక్టోబర్ లో జరిగిన మ్యాచులో గాయపడ్డాడు. అనంతరం రెండు నెలలకు న్యూజిలాండ్ (New Zealand)తో సిరీస్ లో మరో సారి గాయం తిరగబెట్టడంతో ఆటకు దూరమయ్యాడు. కాగా బెన్ స్టోక్స్ మళ్లీ ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో ఆ జట్టు స్ట్రాంగ్ కానుంది. ఇటు భారత్ తో (India Cricket Team) అయిదు టెస్టులు, అటు ఆస్ట్రేలియాతో అయిదు టెస్టులు ఆడనుంది. దీని కోసం రెడీగా ఉన్నట్లు బెన్ స్టోక్స్ తెలపడంతో ఇంగ్లండ్ క్రికెట్ కు పెద్ద ఊరట లభించినట్లయింది.

Ben Stokes ready for reentry ఉత్సాహంగా ఉన్నా..

బెన్ స్టోక్స్ కూడా తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు… కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ (Brendon McCullum) సహకారంతో కచ్చితంగా రాణించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ లో బెన్ స్టోక్స్ గేమ్ అంటే అందరికీ చాలా ఇష్టం. అతని పునరాగమనంతో ఇంగ్లండ్ టెస్ట్ టీం మరింత బలపడుతుందని అందరూ అనుకుంటున్నారు. దీంతో భారత క్రికెట్ జట్టుకు గట్టి పోటీ తప్పదని అనుకుంటున్నారు.

Leave a Comment