Delhi Capitals: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణల (India-Pak clash) వల్ల ఐపీఎల్ అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఐపీఎల్ జరుగుతుందా మధ్యలోనే ఆగిపోతుందా అని చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. అనుకోకుండా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఉద్రిక్తత చల్లారింది. దీంతో ఐపీఎల్ ను మే 17 నుంచి స్టార్ట్ చేయాలని నిర్ణయించారు.
మెక్ గుర్క్ స్థానంలో
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఆస్ట్రేలియన్ బ్యాటర్ మెక్ గుర్క్ తన దేశం వెళ్లిపోయాడు. మెక్ గుర్క్ ప్లేస్ లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్ ను (Mustafizur Rahman) తీసుకుంటున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బంగ్లాదేశ్ లో మొన్నటి వరకు జరిగిన మత ఘర్షణల్లో (Bangladesh riots) ఆ దేశంలోని మైనార్టీలపై విపరీతమైన దాడులు జరిగాయి. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు చేశారు. హింసతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్థాన్ కు సపోర్టు ఇస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బంగ్లా భారత్ బోర్డర్ లో ఉద్రిక్తత కూడా నెలకొంది.
బాయ్ కాట్ ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్లో (IPL) జరిగిన వేలంలో ఏ ఒక్క బంగ్లాదేశ్ ప్లేయర్ అమ్ముడుపోలేదు. ఇప్పుడు మెక్ గుర్క్ (James Fraser McGurk) స్థానంలో ముస్తాఫిజర్ రెహమన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. దీంతో భారత్ లో క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఐపీఎల్ చూసే వారు హాష్ ట్యాగ్ బాయ్ కాట్ ఢిల్లీ క్యాపిటల్స్ అని ట్రెండింగ్ నడుస్తోంది. అసలు వేరే దేశం ప్లేయర్లు లేరా.. బంగ్లాదేశ్ నుంచి ఆటగాన్ని తీసుకోకపోతే మీ జట్టు గెలవదా.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ను బ్యాన్ చేయాలని ట్విటర్ లో పెద్ద వారే నడుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కూడా తిరిగి రాకపోవచ్చని అనుకుంటున్నారు. దీంతో ప్రధాన పేసర్ లేకపోవడంతో ఆ విధుల్ని ముస్తాఫిజుర్ తో ఫిల్ చేసుకుని టీంను ప్లే ఆప్స్ కు చేర్చాలని టీం యాజమాన్యం ఆశిస్తోంది. ఇప్పటికే భారత్, పాక్ ఉద్రిక్తతల (India-Pak clash) సమయంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి ఐపీఎల్ కంటే దేశమే ముఖ్యమని ప్రకటించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్ ను తీసుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ ను బ్యాన్ చేయాలని ట్రెండ్ చేస్తున్నారు. మరి ఐపీఎల్ రీస్టార్ట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద సమస్యే ఎదురుకానుంది.