Virat Kohli: విరాట్ మనసు అలసిపోయింది.. అందుకే రిటెర్మెంట్ ఇచ్చాడు

Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇది విరాట్ తీసుకున్న నిర్ణయమని.. ఏదో సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్-కోచ్ గా వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు తమ బాధ్యతలు నిర్వర్తించారు.

నేను కూడా కొహ్లీ అభిమానినే

రవిశాస్త్రి (Ravi Shastri) మాట్లాడుతూ, కొద్దిరోజుల క్రితమే కోహ్లీతో జరిగిన ఒక వ్యక్తిగత సంభాషణ గురించి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది అభిమానుల్లాగానే కోహ్లీ ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడతారని తాను కూడా అనుకున్నానని రవిశాస్త్రి అన్నారు. అతను తనలోని ప్రతిదాన్నీ క్రికెట్‌కి ఇచ్చేశాడని అతను చెప్పాడు. ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు. కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగాను. అవి అతను ఎంతో స్పష్టంగా చెప్పాడు. నాకు అర్థమైంది అతని మనసు అతని శరీరానికి చెప్పింది ‘ఇంతే సరిపోతుంది’ అని శాస్త్రి వెల్లడించారు.

Virat Kohli కష్టకాలం

కోహ్లీ రిటైర్మెంట్ (Kohlis retirement) ఇచ్చిన సమయంలో అతను టెస్ట్ ఫార్మాట్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. 2020 తర్వాత 65 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 32.09 సగటుతో మాత్రమే రాణించాడు. 68 టెస్టులకు కెప్టెన్సీగా వ్యవహరించిన కొహ్లీ, 40 విజయాలతో భారతదేశానికి అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. అయితే ఈ బాధ్యతలు, అతని పూర్తి స్థాయి శ్రమ వలన శారీరకంగా కాదు, మానసికంగా ఆయన దెబ్బతిన్నాడని తెలిపారు. విరాట్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. నా అభిప్రాయానికి అతనిలో ఇంకా 2–3 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ ఉందని అనిపించేది,అని శాస్త్రి చెప్పారు. కానీ ఒకసారి మనసు అలసిపోయిన తర్వాత, ఎంత ఫిట్‌నెస్ ఉన్నా ఉపయోగం లేదు. అది శరీరానికి సంకేతం ఇస్తుంది ఇక చాలని అదే విరాట్ కొహ్లీ విషయంలో జరిగిందని చెప్పాడు.

టెస్టు క్రికెట్ కు వన్నె తెచ్చాడు

టెస్ట్ క్రికెట్‌కు (Test Cricket) విరాట్ ఇచ్చిన గౌరవం ఎనలేదన్నాడు. విరాట్ టెస్ట్ క్రికెట్‌ను ఓ వేదికగా మార్చాడు. అతని శైలి, ఆగ్రెసివ్ కాప్టెన్సీ, బాడీ లాంగ్వేజ్ టెస్ట్ ఫార్మాట్‌ను మరింత ప్రాధాన్యంగా నిలిపాయి. అతని వ్యక్తిత్వం అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ప్రపంచంలో అతని స్థాయి వేరే లెవెల్. అతను ఆడిన చోట ప్రజలు మ్యాచ్ చూడడానికి తండోపతండాలుగా జనాలు వచ్చేవారు. అతని ఎనర్జీ డ్రెస్‌రూమ్‌లో కాదు, టీవీల్లో కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేసేది.

Leave a Comment