Virat Kohli: టెస్టుల్లో విరాట్ కొహ్లీ నాలుగో స్థానాన్ని భర్తీ చేసేదెవరో

Who will replace Virat Kohli at number four in Tests

Virat Kohli: భారత క్రికెట్ టెస్టు టీం ప్రస్తుతం సంధి కాలం ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కొహ్లీ (Virat Kohli) వారం వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం టీం ఇండియా కెప్టెన్ ఎవరనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. కాగా ఇప్పటి వరకు టెస్టుల్లో మిడిలార్డర్ లో కింగ్ విరాట్ కొహ్లీ జట్టు బ్యాటింగ్ బాధ్యతల్ని మోస్తున్నాడు. ఒకప్పుడు సచిన్, మొన్నటి వరకు కొహ్లీ.. ఇప్పుడు ఎవరనే దానిపై అటు బీసీసీఐ, ఇటు టీం ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Virat Kohli కేఎల్ రాహుల్ టీంలో ఉన్నప్పటికీ

అజింక్య రహనే (Ajinkya Rahane) చటేశ్వర్ పూజరా ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయారు. విరాట్, రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మిడిలార్డర్ లో జట్టును ముందుండి నడిపించే బ్యాటర్ ఎవరనే దానిపై పెద్ద చర్చే సాగుతోంది. కేఎల్ రాహుల్ టీంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నాలుగో స్థానంలో పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. సర్పరాజ్ ఖాన్ ఒకటి రెండు మ్యాచులు మినహా పరుగులు చేయలేదు. ఆస్ట్రేలియా సిరీస్ లో ఏడో స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేశాడు.

ఇప్పుడు మళ్లీ అజింక్య రహనెను (Virat Kohli) ఇంగ్లాండ్ టూర్ కు సెలెక్ట్ చేస్తారా? లేక యువ ఆటగాళ్లనే రాటు దేల్చేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తారా అన్నది చూడాలి. సచిన్ రిటైర్ అయిన టైంలో ఆ స్థానాన్ని కొహ్లీ, రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని పూజారా భర్తీ చేశారు. ఇప్పుడు కూడా టీం ఇండియాకు టెస్టుల్లో ఆ రెండు స్థానాల్లో భర్తీ చేయగల ప్లేయర్ అవసరం. ఈ స్థానం కోసం డజన్ల కొద్దీ ప్లేయర్లు పోటీ పడుతున్నా.. నిలదొక్కుకొని నిలకడగా రాణించే ప్లేయర్ కోసం బీసీసీఐ వేట సాగిస్తోంది. టెస్టుల్లో వన్ డౌన్ కోసం సాయి సుదర్శన్ (Sai Sudarshan) పేరు కొత్తగా రేసులోకి వచ్చింది. విరాట్ స్థానంలో కేఎల్ రాహుల్ (KL Rahul) సర్పరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) తో అజింక్య రహనే పేరు వినిపిస్తోంది. త్వరలో బీసీసీఐ ఇంగ్లాండ్ కు పంపే టీంను సెలెక్ట్ చేయనుంది. ఇందులో ఎవరికీ చాన్సు దక్కుతుందో చూడాలి.

Leave a Comment