ipl play offs: అత్యధిక సార్లు ప్లే ఆప్స్ చేరిన జట్టు ఏదో తెలుసా..

ipl play offs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 లో ప్రారంభమైంది. మొదటి సీజన్ లో ప్లే ఆప్స్ అనేది లేకున్నా.. ఆ తర్వాత సీజన్ నుంచి ప్లే ఆప్స్ రేసును ప్రారంభించారు. నాలుగు టీంలు ప్లే ఆప్స్ కు చేరుకుంటాయి. ఇందులో అత్యధిక పాయింట్లు, నెట్ రన్ రేట్ (net run rate) ఉన్న జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. ఇందులో ప్లే ఆప్స్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు మ్యాచు గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో చాన్స్ ఇస్తారు. మూడో స్థానంలో, నాలుగులో ఉన్న జట్లు ఆడిన మ్యాచులో ఓడిన టీం ఇంటి బాట పడుతుంది. గెలిచిన వారికి రెండో స్థానంలో ఉన్న దాంతో మరో మ్యాచు ఆడుతుంది.

అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్

ఇప్పటి వరకు దాదాపు 17 సీజన్ లలో ప్లే ఆప్స్ నిర్వహించగా.. ప్లే ఆప్స్ కు అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) జట్టు చేరింది. ఆ జట్టు ఇప్పటి వరకు ఏకంగా 12 సార్లు ప్లే ఆప్స్ కు చేరి మొదటి స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 11 సార్లు ప్లే ఆప్స్ కు చేరి సత్తా చాటుకుంది. ఐపీఎల్ టోర్నీ కి ముందు ఎన్నో జట్లు అంచనాలతో బరిలోకి దిగుతాయి. కానీ రెండు జట్లు మాత్రం ప్లే ఆప్స్ కు చేరుకుంటాయి. ఇలాంటి జట్లలో ముందు వరుసలో ఉండే టీంలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ipl play offs: ముంబై ఇండియన్స్ ప్లే ఆప్స్ కు

ఐపీఎల్ 18 వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ప్లే ఆప్స్ కు చేరుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పేలవ ప్రదర్శనతో 10 స్థానానికి పడిపోయింది. అయితే చెన్నై, ముంబై (mumbai indians) టీంలు ఇప్పటికే అయిదు సార్లు టైటిల్ గెలిచి వాటి సత్తా నిరూపించుకున్నాయి. మొత్తం ఇప్పటి వరకు 17 టైటిళ్లలో 10 సార్లు ఈ రెండు టీంలే గెలిచాయి అంటే ఎంతటి బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రెండు టీంలకు ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నారు. మొత్తం మీద ముంబై ఇండియన్స్ 11 వ సారి ప్లే ఆప్స్ చేరి టైటిల్ ఆశలను నిలబెట్టుకుంది.

Leave a Comment