Delhi Capitals: ప్లే ఆప్స్ కు చేరిన ముంబై ఇండియన్స్.. ఇంటి బాట పట్టిన ఢిల్లీ

Delhi Capitals: ఐపీఎల్ ప్లే ఆప్స్ (Play-offs) రేసు ముగిసింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మ్యాచ్ మిగిలిఉండగానే ఎలిమినేట్ అయింది. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలో వరుసగా నాలుగు మ్యాచులు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆ తర్వాత నుంచి తేలిపోయారు. మొత్తం 13 మ్యాచుల్లో కేవలం తొమ్మిది మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి ఆరు గేముల్లో ఓటమిపాలయ్యారు. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఒక పాయింట్ తో గట్టెక్కారు.

మరో మ్యాచ్ మిగిలి ఉండగానే..

సీజన్ ఆరంభంలో ఢిల్లీ (Delhi Capitals) ఆట చూసిన ప్రతి ఒక్కరూ ఈసారి కచ్చితంగా ఐపీఎల్ లో ప్లే ఆప్స్ లో ఉండే జట్లలో మొదటి స్థానంలో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ తీరా మరో మ్యాచు మిగిలి ఉండగానే రేసు నుంచి తప్పుకుని ఎప్పటిలాగే దురదృష్టం, ఆటతీరులో ఎలాంటి మార్పు లేని జట్టుగా నిలిచింది.

Delhi Capitals: కెప్టెన్, కోచ్ మారిన తల రాత మారలే..

ఢిల్లీ కెప్టెన్, కోచ్ లను మార్చిన క్యాపిటల్స్ యాజమాన్యం, సపోర్ట్ స్టాప్ ను కూడా పూర్తిగా మార్చి వేసింది. దీంతో సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోయింది. కానీ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ చేతిలో చివరి ఓవర్ లో ఓటమి పాలైనప్పటి నుంచి మళ్లీ పాత కథే మొదలైంది. బ్యాటర్లలో నిలకడలేమి, బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా వెళ్లిపోవడం.. కీలకమైన మ్యాచులో కెప్టెన్ అక్షర్ పటేల్ గాయపడటం ఇలా అన్ని ప్రతికూలతలు ఎదురయ్యాయి. దీంతో ఎప్పటిలాగే ప్లే ఆప్స్ కు వెళ్లకుండానే ఢిల్లీ ఇంటి బాట పట్టింది.

18 ఓవర్ల వరకు ఒక రకంగా.. ఆ తర్వాత మరో రకంగా

ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాటర్లను మొదటి ఇన్సింగ్స్ లో 18 ఓవర్ల వరకు బాగానే కట్టడి చేశారు. చివరి రెండు ఓవర్లలో ముఖేశ్ కుమార్ 26, చమీర 21 పరుగులు ఇవ్వడంతో ఏకంగా 48 పరుగులు వచ్చాయి. దీంతో బౌలింగ్ పిచ్ పై ముంబై 180 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. దీనికి తోడు ఢిల్లీ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెనుదిరగడంతో ముంబై విజయం నల్లేరు పై నడకే అయింది.

Leave a Comment