Preity Zinta moves courtపంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా

Controversy within the Punjab Kings team Preity Zinta moves court

Preity Zinta moves court: పంజాబ్ కింగ్స్ జట్టులోని యాజమాన్యం మధ్య వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఆ జట్టు కో ఓనర్ ప్రీతిజింటా (Preity Zinta) సహ డైరెక్టర్లు నెస్ వాడియా (Ness Wadia), మోహిత్ బుర్మాన్ పై కోర్టు లో కేసు దాఖలు చేసింది. తనకు తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా వీరు సమావేశం నిర్వహించారంటూ పిటిషన్ దాఖలు చేసింది.

Preity Zinta moves court: చండీగఢ్ కోర్టుకు ప్రీతి జింటా..

కేపీహెచ్‌ డ్రీమ్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. పంబాబ్ కింగ్స్ (Punjab Kings owner) జట్టు కూడా వీరిదే. గత నెల 21న నిర్వహించిన సర్వసభ్య సమావేశంపై ప్రీతిజింటా చండీగఢ్ కోర్టులో కేసు వేసింది. 2013 కంపెనీ రూల్స్ ప్రకారం.. సమావేశం నిర్వహిచాలని కానీ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా చేయాలని పట్టుబట్టింది. తమకు తెలియకుండా మీటింగ్ లో మునీశ్‌ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించడాన్ని ప్రీతి జింటా, కరుణ్ పాల్‌ (Karun Paul) వ్యతిరేకించారు. డైరెక్టర్‌గా ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని ఆమె తన పిటిషన్‌లో కోర్టును కోరింది. తాము లేకుండా బోర్డు మీటింగ్ లు పెట్టకుండా చూడాలని కోర్టును కోరింది.

పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు హాజరై..

బోర్డులో వివాదాలు నెలకొన్న సమయంలో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు ప్రీతి జింటా హాజరై ఉత్సహపరిచింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ (Punjab Kings )ప్లేఆప్స్ కు అర్హత సాధించింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్ కాగానే టీంను ముందుండి నడిపిస్తున్నాడు. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు అందరూ సమష్టిగా రాణిస్తుండటంతో పంజాబ్ కింగ్స్ విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాప్ 2ప్లేస్ కోసం పోరాడుతోంది. అదే గనక జరిగితే ఒక్క మ్యాచ్ గెలిచి నేరుగా ఫైనల్ చేరి కప్ కొట్టాలని ఊబలాటపడుతోంది.

Leave a Comment