India vs England: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు కొత్త ముఖాలు.. ఎవరిని అదృష్టం వరించేనో

New faces for the Test series with England Who will be lucky

India vs England: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు బౌలింగ్, బ్యాటింగ్ లో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. బ్యాటింగ్ లో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ సెలక్షన్స్ పై పూర్తిగా దృష్టి సారించింది. విరాట్ కొహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల, సామర్థ్యమున్న ఆటగాడిని వెతికే పనిలో పడింది.

India vs England: సాయి సుదర్శన్ పైనే కళ్లన్నీ

సాయి సుదర్శన్ (Sai Sudarshan) లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనింగ్ బ్యాటర్ గా దిగి ఇప్పటికే 617 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. దీంతో పాటు మిస్టర్ కన్సిస్టెంట్ అని బిరుదును కూడా అందుకున్నారు. సాయి సుదర్శన్ గత మూడు సీజన్ లుగా ఫామ్ కోల్పోకుండా బాగా ఆడుతున్నాడు. విరాట్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడు సాయి సుదర్శన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ కు సాయి సుదర్శన్ కచ్చితంగా ఎంపికవుతాడని అందరూ అనుకుంటున్నారు.

India vs England: అజింక్య, పూజారాలను తీసుకొస్తారా?

విరాట్ కొహ్లీ , రోహిత్ శర్మ (Rohit Sharma) లు టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో సీనియారిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ ఉన్నా.. నిలకడలేమి బ్యాటింగ్ తో ఇబ్బంది పడుతున్నాడు. సర్పరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ ఇద్దరు అనుభవ లేమి. ఓపెనర్లుగా గిల్, యశస్వి జైశ్వాల్ ఇద్దరు యంగ్ ప్లేయర్లు. కాబట్టి ఇంగ్లండ్ లో ఆడిన అనుభవం ఉన్న పూజారా (Pujara)ను టెస్టుల్లో మళ్లీ తీసుకుంటారనే ఊహగాహనాలు నడుస్తున్నాయి. రహనె (Ajinkya Rahane) ను కూడా తీసుకుంటే ఇద్దరి అనుభవంతో ఇంగ్లండ్ పిచ్ లపై పోరాటం చేసేందుకు చాన్స్ ఉందని అనుకుంటున్నారు.

బౌలింగ్ లో కూడా మార్పులు అవసరమే

ప్రస్తుతం బౌలింగ్ మొత్తం జస్ ప్రీత్ బుమ్రా మోస్తున్నాడు. అతడిని కెప్టెన్ చేయాలని భావిస్తున్నప్పటికీ అది జట్టుపై భారం పడకుండా ఉండాలి. మహమ్మద్ షమీ గాయం వల్ల టెస్టుల్లో సుదీర్ఘమైన బౌలింగ్ వేయలేకపోవచ్చని అంచనా వేస్తున్నారు. భువీ (Bhuvi) పామ్ లేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. మరో వైపు హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు ఆస్ట్రేలియాలో అంతంత మాత్రమే రాణించారు. మహమ్మద్ సిరాజ్ ను మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరాజ్, బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ ను తుది జట్టులో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంగ్లండ్ లో (England) సిరీస్ విజయం సాధించాలంటే ఆషామాషీ విషయం కాదు. బంతి గమనం మార్చుకుని వికెట్ల కు రెండు వైపుల స్వింగ్ అవుతూ దూసుకువస్తుంటుంది. ఇలాాంటి సందర్భంలో గాలి వేగం అంచనా వేస్తూ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. స్వింగ్ బౌలింగ్ లో ఆడాలి. ఇంగ్లండ్ లో టెస్ట్ పిచ్ లపై గంటల తరబడి వేచి ఉంటే పరుగులు అవే వస్తాయని అనడంలో సందేహం లేదు. కానీ ఓపికగా క్రీజులో పాతుకుపోయే బ్యాటర్ ఎవరనేది ఇప్పటికీ తెలియడం లేదు.

కొత్త ముఖాలపై..

అభిమన్యు ఈశ్వరన్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ తో పాటు సూర్య కుమార్ యాదవ్ కూడా టెస్టుల్లో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు బౌలింగ్ లో అర్షద్ ఖాన్, అవేశ్ ఖాన్, నటరాజన్, హర్షిత్ రాణా (Harshit Rana) తో పాటు యువ క్రికెటర్లు ఇంగ్లండ్ టూర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీసీసీఐ సెలక్టర్లు ఎలాంటి మార్పులు తీసుకొస్తారు. టీంను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి

Leave a Comment