rohit sharma: రోహిత్ సరద సరదగా.. జానీ బెయిర్ స్టో పేరుతో కోరస్ పాడగా..rohit sharma:

Rohit was having fun while singing the chorus under the name of Jonny Bairstow

rohit sharma: ముంబై ఇండియన్స్ ( mumbai indians ) శిబిరంలో రోహిత్ శర్మ ( rohit sharma) ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఎంత ఎదిగినా సన్నిహితులతో సహచరులతో తేలికగా కలిసిపోయే స్వభావం రోహిత్ శర్మది. ముంబయి ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ లో తాజాగా రోహిత్ శర్మ తన సహచర ఆటగాడు జానీ బెయిర్ స్టో పేరును పాటలో కోరస్ కలిసేసి పాడుతూ కనిపించాడు.
మలోన్ హిట్ సాంగ్ ‘సర్కిల్స్’ ను పాడుతూ కనిపించాడు. ఈ వీడియోలో రోహిత్ తనదైన శైలిలో పాట పాడుతూ, ఒరిజినల్ లిరిక్స్‌ను మార్చి ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో పేరును కోరస్‌లో చొప్పించి హాస్యభరితమైన వాతావరణాన్ని సృష్టించాడు. దీంతో ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ తో పాటు అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు.

rohit sharma:ఉల్లాసంగా ముంబై శిబిరం

ఈ క్షణం రోహిత్ సంగీత ( music) నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, ఐపీఎల్ ఒత్తిడిలోనూ ముంబై శిబిరంలోని ఎలాంటి ఉల్లాసభరితమైన వాతావరణం ఉంటుందో తెలియజేసింది. తన శాంతమైన స్వభావంతో జట్టుకు సానుకూలమైన శక్తిని అందించే రోహిత్, డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వైబ్‌లకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నాడు.

సమస్యలతో గుజరాత్ టైటాన్స్

ఇక ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌ను ముందు చూసిన గుజరాత్ టైటాన్స్ ( gujarat titans) కొన్ని కీలక సమస్యలతో తడబడుతోంది. జోస్ బట్లర్ ఇంగ్లాండ్ టీం డ్యూటీతో దూరమవడం, కొత్తగా వచ్చిన కుశాల్ మెండిస్‌కు అనుభవం లేకపోవడం వారి బ్యాటింగ్‌ను ప్రభావితం చేస్తోంది. బౌలింగ్‌లోనూ రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్లు ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ అస్తిరమైన మిడిల్ ఆర్డర్‌తో ఇబ్బందిపడుతుండగా, జానీ బెయిర్‌స్టో వంటి అనుభవజ్ఞుడిని జట్టులోకి తీసుకోవడం వారికి కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో మాత్రం జీటీతో పోలిస్తే స్థిరంగా కనిపిస్తున్నారు. లీగ్ దశలో రెండు విజయాలతో ఉన్న జీటీ మాత్రం తమ హెడ్-టు-హెడ్ రికార్డుతో ధైర్యంగా ఉంది. ఈ నేపధ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారనుంది.

Leave a Comment