This is how Punjab plays Is this how they played in the qualifiers
shreyas Ayyar: పంజాబ్ కింగ్స్ (panjab kings) 18 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురు చూస్తోంది. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా ఎక్కడో చివరి స్థానంలో ఉంటుందని అనుకున్న పంజాబ్ కింగ్స్ ఏకంగా టేబుల్ టాపర్ లో నిలిచింది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడే చాన్స్ రావడం, అది కూడా హోం గ్రౌండ్ ముల్హాన్ పూర్ లో ఉండటంతో కోటి ఆశలతో గ్రౌండ్ కు చేరుకున్న పంజాబ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
panjab kings lose: బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలం
బ్యాటింగ్, బౌలింగ్ అనే తేడా లేకుండా రెండింటిలో విఫలమై చిత్తు చిత్తుగా ఓడిపోయింది. క్వాలిఫైయర్ లో ఇలాంటి ప్రదర్శన పంజాబ్ కింగ్స్ నుంచి ఊహించనిదే. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (shreyas ayyar) మాట్లాడుతూ.. నిజంగా ఇది నిరాశపరిచింది. మేం పిచ్ ను సరిగా అంచనా వేయలేకపోయాం. కంటిన్యూగా వికెట్లు పడటం కూడా మాకు కలిసిరాలేదని చెప్పొచ్చు. నిజంగా చింతిస్తున్నామని అన్నాడు.
టాప్ ఆర్డర్స్, మిడిలార్డర్ కుప్పకూలిన వేళ
టీ 20 అంటనే ధనాధన్ ఇన్సింగ్స్ లు అని అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సార్లు అక్కడ కూడా ఓపికగా ఆడాలని నేర్చుకోవాలి. పంజాబ్ కింగ్స్ లో దాదాపు 10 మంది బ్యాటర్లు ఉన్నా కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీంతో కేవలం 14 ఓవర్లు మాత్రమే ఆడి 101 పరుగులు చేసింది. అప్పటికే ఫుల్ జోష్ లో ఉన్న ఆర్సీబీ కేవలం పది ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండు జట్లది సేమ్ ఒకటే పరిస్థితి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. కనీసం ప్లాన్ తో ఆడి ఎదుటి జట్టుకు కళ్లెం వేయాలని దృష్టి కూడా లేకుండా పంజాబ్ కింగ్స్ ఆడటంపై క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరస్తున్నారు. కాగా పంజాబ్ కింగ్స్ కు మరో చాన్స్ ఉంది. గుజరాత్ (gujarat titans) , ముంబై ఇండియన్స్ ( mumbai indians) మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచులో ఎవరూ గెలిస్తే వారితో పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిచి ఎలాగైనా ఫైనల్ చేరి కప్ కొట్టాలని పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.