Rcb into final: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ( panjab kings) కు చిత్తు చేసి ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరుకుంది. దీంతో విరాట్ కొహ్లీతో పాటు ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సాలా కప్ నామ్ దే అంటూ కేరింతలు కొడుతున్నారు. ఐపీఎల్ 18వ ఎడిషన్ కు సంబంధించి టేబుల్ టాప్ 2 లో ఉన్న ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది.
Rcb into final: టాసే కీలకమైన వేళ
మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ (rcb) పంజాబ్ కు బ్యాటింగ్ అప్పగించింది. అప్పటి నుంచి ఒకే జోష్ కొనసాగింది. పంజాబ్ కింగ్స్ ఆర్సీబీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 7 పరుగులకే మొదటి వికెట్ రూపంలో వెనుదిరగగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడుతున్నాం అని పంజాబ్ బ్యాటర్లు మరిచిపోయారు. శ్రేయస్ అయ్యర్ (2), ప్రియాంశ్ ఆర్య (7), జోష్ ఇంగ్లిష్ (4), నెహాల్ వదెరా (8) శశాంక్ సింగ్ (3) ముషీర్ ఖాన్ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఆదుకుంటాడనుకున్న మార్కస్ స్టోనియిస్ (28) పరుగుల వద్ద నిర్లక్ష్య షాట్ కు అవుటయ్యాడు. దీంతో పంజాబ్ కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది.
ఫైనల్ కు చేరడంతో
సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీ విరాట్ కొహ్లీ ( virat kohli ) (12) పరుగుల వద్ద ఔటైనా.. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 27 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో 56 పరుగులు చేసి పంజాబ్ నుంచి మ్యాచును లాగేసుకున్నారు. కేవలం 10 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసి ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగో సారి. ఇంతకుముందు మూడు సార్లు ఫైనల్ చేరినా కప్ వేటలో ఓటమి చవిచూసింది. ఈ సారి మాత్రం పక్కా కప్ కొట్టి తీరతామని ఆర్సీబీ ప్లేయర్లు గట్టి పట్టుదల చూపిస్తున్నారు.