India vs England: రాబోయే రెండు నెలలు టీం ఇండియా క్రికెటర్లు, అండర్ 19, ఇండియా ఏ జట్టు, మహిళల జట్టు వివిధ ఫార్మాట్లలో బిజీ బిజీగా గడపనున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ (England Cricket) చేరుకున్న ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ తో రెండు అన్ అపిషీయల్ టెస్టులు ఆడనుంది. ఈ టీంకు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ మే 30న ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), శార్దూల్ ఠాకూర్ ఇంగ్లాండ్ కు చేరుకున్నారు. వీరు ముగ్గురు కూడా మెయిన్ జట్టులో చోటు సంపాదించుకున్నారు.
జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకుఇంగ్లాండ్ తో ఇండియా అయిదు టెస్టులు ఆడనుంది. శుభమన్ గిల్ ను టెస్ట్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. జస్ ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ కారణంగా అయిదు టెస్టులు ఆడకపోవచ్చని అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (ajit agarkar) చెప్పాడు.

ఇండియా అండర్19 జట్టు జూన్ 24 నుంచి ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఇంగ్లాండ్ తో ఆడనంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (vaibhav suryavamshi) చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఆయుశ్ మాత్రే ఇద్దరు ఈ జట్టులో ఉన్నారు. జూన్ 28 నుంచి జూలై 22 వరకు మహిళల టీ20లు, వన్డేలు జరగనున్నాయి. పామ్ కోల్పోయి జట్టులో చోటు స్థానం కోల్పోయిన షెపాలీ వర్మ తిరిగి టీ 20 జట్టులో చోటు సంపాదించింది. మొత్తం మీద ఇంగ్లండ్ లో భారత క్రికెట్ జట్లు ఫుల్ బిజీ షెడ్యూల్ తో గడపనున్నాయి.