Rohit Sharma: ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) చెలరేగి ఆడింది. గుజరాత్ టైటాన్స్ పై మొదటి ఇన్సింగ్స్ లో 20 ఓవర్లలో 228 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది. రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో సిక్సులు, ఫోర్లతో చెలరేగడంతో ముంబయి ఈ సీజన్ లోనే అత్యధిక పవర్ ప్లే స్కోరు సాధించింది. కాగా జానీ బెయిర్ స్టో 22 బంతుల్లో 47 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పటికే గుజరాత్ ఫీల్డర్లు రోహిత్ శర్మ 3, 12 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ లు జారవిడవడంతో రోహిత్ శర్మ నాలుగు సిక్సులు, 9 ఫోర్లతో 50 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. సూర్య కుమార్ 40, తిలక్ వర్మ (Tilak Verma) 25, హర్దిక్ పాండ్యా 22 రాణించడంతో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228 భారీ స్కోరు చేసింది.
Rohit Sharma: ఇదేం ఫీల్డింగ్ గుజరాత్
ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ (Gujarat Titans) ఫీల్డర్లు చేతులెత్తేశారు. రోహిత్ శర్మ 3, 12 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచులను కొయొట్జి, కుశాల్ మెండిస్ జారవిడిచారు. సిరాజ్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ మిస్ చేశాడు. దీంతో రోహిత్ 80, సూర్య (Suryakumar Yadav) 40 పరుగులతో రాణించారు. ఈ మ్యాచులో ఎవరూ ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. గెలిచిన జట్టు పంజాబ్ కింగ్స్ తో జూన్ 1 వ తేదీన మరో మ్యాచ్ చాన్స్ ఉంటుంది. ఈ మ్యాచులో గెలిస్తే ఫైనల్ లో ఆర్సీబీతో ఐపీఎల్ 2025 టైటిల్ లో తలపడనుంది.