A thrilling World Test Championship
World Test Championship: ఆస్ట్రేలియా (Australia), సౌతాఫ్రికా మధ్య లార్డ్స్ (Lords) లో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రెండో రోజు ఆట ముగిసే సరికి రసవత్తరంగా మారిపోయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్సింగ్స్ లో 212 పరుగులకే అవుట్ కాగా.. సౌతాఫ్రికా 138 పరుగులకే ఆలౌట్ అయింది. సెకండ్ ఇన్సింగ్స్ లో 73/7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అలెక్స్ క్యారీ 43 పరుగులతో ఆదుకున్నాడు. మిచెల్ స్టార్క్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు 63 పరుగుల పార్ట్ నర్ షిప్ ఇచ్చాడు.
చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు
రబాడ, ఎంగిడి చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆస్ట్రేలియా 114/8 వికెట్లతో రెండో రోజు ఆట ముగించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 218 పరుగుల లీడ్ లో ఉంది. కాగా పిచ్ పూర్తిగా బౌలింగ్ కు అనుకూలిస్తోంది. ఆట మధ్యలో కాస్త వర్షం కూడా పడగా సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఫస్ట్ ఇన్సింగ్స్ లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) 28 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. బౌలింగ్ కు పూర్తి స్థాయిలో అనుకూలిస్తున్న పిచ్ పై సౌతాఫ్రికా బ్యాటర్లు నాలుగో ఇన్సింగ్స్ లో ఎలా బ్యాటింగ్ చేస్తారని ఇప్పుడు వారి ముందున్న సవాల్. ఇప్పటికే ఐసీసీ టైటిల్స్ గెలవడం లేదనే బాధలో ఉన్న సౌతాఫ్రికాకు మంచి అవకాశం ఉంది. మరో రెండు ఆసీస్ వికెట్లను తొందరగా నేలకూల్చి 230 లోపు టార్గెట్ పెట్టుకుంటే కాస్త కష్టమైనా ఛేజ్ చేయొచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా నిలవాలంటే ప్రస్తుతం ధైర్యంగా పోరాడటమే ప్రోటీస్ టీం ముందున్న ఛాలెంజ్.
World Test Championship: కెప్టెన్ టెంబ బవుమా రాణిస్తేనే..
సౌతాఫ్రికా (South Africa) కెప్టెన్ టెంబ భవుమా రాణిస్తేనే సౌతాఫ్రికా గెలుపు సాధ్యమవుతుంది. మిగతా బ్యాటర్లు అనుభవలేమితో ఉన్నారు. అది కాకుండా అడెన్ మార్ క్రమ్ బ్యాటింగ్ లో పూర్ పామ్ కొనసాగుతుంది. కాబట్టి ప్రతి బ్యాటర్ 20 నుంచి 30 పరుగులు చేసినా మ్యాచ్ గెలవొచ్చు. మరి సౌతాఫ్రికా బ్యాటర్లు మ్యాచ్ గెలిచి వచ్చినా సువర్ణవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారో.. లేక ఎప్పటిలాగే ఆసీస్ కు గెలుపు అప్పగించి ఫైనల్ లో ఓటమి తమకు అలవాటే అని నిరూపించుకుంటారో రేపటి లోగా తేలిపోనుంది.