Steve Smith: లార్డ్స్ లో రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్

Steve Smith breaks record at Lords

Steve Smith: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ (Lords) లో జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా బౌలర్లు ఆసీస్ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించారు. కాగా నాలుగు వికెట్లు పడినా కూడా స్టీవ్ స్మిత్ వీరోచిత పోరాటం చేసి శభాష్ అనిపించుకున్నాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసిన స్మిత్ ఆస్ట్రేలియా జట్టును ఆదుకున్నాడు. ఇదే సమయంలో లార్డ్స్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ లార్డ్స్ లో ఏకంగా 591 పరుగులు చేసి మరో ఆసీస్ క్రికెటర్ వారెన్ బార్డ్సీ 575 పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

లార్డ్స్ అంటే స్టీవ్ స్మిత్ కు ఇష్టం

లార్డ్స్ మైదానం లో స్టీవ్ స్మిత్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచులో 215 పరుగులు చేసి సత్తా చాటాడు. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ పోటీలో స్టీవ్ స్మిత్ 66 పరుగులు చేసి అవుటయ్యాడు. లార్డ్స్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు దిలీప్ వెంగ్ సర్కార్ పేరిట ఉంది. ఆయన లార్డ్స్ లో 503 పరుగులు చేశాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ (Ganguly), పూజారా, కొహ్లీ లాంటి హేమహేమీలు కూడా వెంగ్ సర్కార్ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు.

Leave a Comment