Travis Head out in Test Championship.. Indian fans happy
Travis Head : 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లార్డ్స్ లో జరుగుతుండగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ (travis head) దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ (marco jhonsen) బౌలింగ్ లో తొందరగా అవుట్ కావడంతో నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. కొంతమంది నో రోహిత్ శర్మ, నో పార్టీ అంటూ కామెంట్ చేయగా.. మరి కొందరు వెల్ డన్ సౌతాఫ్రికా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2023 లో జరిగిన ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో ఇండియాపై ట్రావిస్ హెడ్ భారీ శతకం బాదాడు. దీంతో ఆ మ్యాచులో ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది.
ట్రావిస్ హెడ్ పై ట్రోల్స్..
ట్రావిస్ హెడ్ 13 పరుగులకే అవుట్ కావడంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో కూడా భారీ సిక్సులు, ఫోర్లతో చెలరేగి ఆడుతున్న రోహిత్ శర్మ(rohith sharma) క్యాచ్ ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన ఇండియా భారీ స్కోర్ చేయడంలో వెనకబడింది. 2023 లో కూడా టీం ఇండియాపై వరల్డ్ కప్ ఫైనల్ లో సెంచరీ చేసి కప్ దూరం చేసి ట్రావిస్ హెడ్. అదే ఏడాది టెస్ట్ చాంపియన్ షిప్ లో కూడా సెంచరీ బాది భారత్ కు టెస్ట్ ఛాంపియన్ షిప్ లేకుండా చేశాడు. అందుకే ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలవాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.