Mehdi Hasan Miraj: బంగ్లా వన్డే కెప్టెన్ గా మెహదీ హసన్ మిరాజ్

Mehdi Hasan Miraj named Bangladesh ODI captain

Mehdi Hasan Miraj: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) జూన్ 12న మెహిదీ హసన్ మిరాజ్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా ప్రకటించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో నుంచి వన్డే కెప్టెన్ బాధ్యతలు మెహదీ హసన్ మిరాజ్ కు బంగ్లా క్రికెట్ బోర్డు అప్పగించింది. జులై 2 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ నుంచి మెహదీ హసన్ మిరాజ్ బంగ్లా వన్డే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇటీవల శాంటో టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయగా లిటన్ కుమార్ దాస్ కు బ్యాటింగ్ అప్పగించారు. శాంతో బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ వన్డే కెప్టెన్సీ మాత్రం కొనసాగిస్తారని భావించారు. అయితే బోర్డు ఆలోచన మార్చుకుంది. బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబేదీన్ మాట్లాడుతూ.. మిరాజ్ అల్‌రౌండర్‌గా రాణించడంతో పాటు, జట్టు బాధ్యతలు కూడా మోయగల సామర్థ్యమున్న వ్యక్తి అని నమ్ముతున్నట్లు ప్రకటించారు.

మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

మెహదీ హసన్ మిరాజ్ ఇప్పటికే 105 వన్డేల్లో 1617 పరుగులు, 110 వికెట్లు సాధించాడు. ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు . 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన నాలుగో బంగ్లాదేశ్ ఆటగాడు మెహదీ హసన్ మిరాజ్. దేశానికి నాయకత్వం వహించడం గర్వకారణం. జట్టు ప్రతిభతో పాటు ధైర్యంతో కూడిన ఆటతీరు ప్రదర్శించేందుకు రెడీగా ఉన్నట్లు మెహదీ హసన్ ప్రకటించారు. ఇక బంగ్లాదేశ్ వేర్వేరు ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్ల విధానాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం టెస్టులకు (Nazmul Santo) శాంటో, టీ20లకు లిటన్ దాస్, వన్డేలకు ప్రస్తుతం మెహదీ హసన్ మిరాజ్ వ్యవహరించనున్నాడు. కాగా బంగ్లాదేశ్ ప్రధాన టీం ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఐసీసీ టైటిల్స్ గెలవలేదు. కేవలం కాగితపు పులులు గానే బంగ్లా క్రికెటర్లకు పేరుంది.

Leave a Comment