Jasprit Bumrah: ఇంగ్లాండ్ టూర్ లో భారత పేసర్లకు పరీక్ష

Test for Indian pacers on England tour

Jasprit Bumrah: ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల సిరీస్ (England tour of India) కు టీం ఇండియా ఆరుగురు పేసర్లను పంపించింది. జస్ ప్రీత్ బుమ్రా పేస్ దళానికి నాయకత్వం వహించనుండగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్ లను సెలెక్ట్ చేసింది. ఇందులో బుమ్రా, సిరాజ్ ఇద్దరూ సీనియర్లు కాగా.. మిగతా వారికి విదేశాల్లో ఎక్కువగా ఆడిన అనుభవం లేదు. ఇంగ్లాండ్ లో సాధారణంగానే బౌలింగ్ కు పిచ్ లు అనుకూలిస్తుంటాయి. కానీ ఈ పిచ్ లపై ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఎక్కువ అనుభవం ఉంటుంది. మరి ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేసేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారో టీం ఇండియా బౌలింగ్ దళం ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Jasprit Bumrah బూమ్ బూమ్ బుమ్రా ఓకే.. కానీ మిగతా వారి సంగతేంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (Border Gavaskar Trophy)లో బుమ్రా ఒక్కడే 30 వికెట్లు తీశాడు. దీంతో వెన్ను నొప్పి బాధించడంతో అయిదో టెస్టు రెండో ఇన్సింగ్స్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సీరిస్ 3‍‍‍-1 తో కోల్పోవాల్సి వచ్చింది. ఏకంగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు దూరం కావడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింది. ఈ సారి పేసర్లు రాణింపుపై భారత విజయాలు ఆధారపడి ఉంటాయి. మిగతా ఫాస్ట్ బౌలర్లు కూడా బాధ్యతాయుతంగా బౌలింగ్ వేసి కట్టుదిట్టంగా బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయాలి. అలా చేయకపోతే ఇంగ్లాండ్ లో ఆ టీంను ఓడించడం చాలా కష్టం.

కొత్త బౌలింగ్ దళంతో..

ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, శార్దూల్, అర్షదీప్ లకు పరిమిత అవకాశాలు వస్తుంటాయి. అర్షదీప్ సింగ్ ఇంకా టెస్ట్ క్రికెట్ లో అరంగ్రేటం చేయలేదు. ఈ సిరీస్ లో అర్షదీప్ (Arshdeep Singh) కు కచ్చితంగా చాన్స్ వస్తుందని అనుకుంటున్నారు. సీనియర్ సిరాజ్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇంగ్లాండ్ లో కొత్త బౌలింగ్ దళంతో టీం ఇండియా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a Comment