Kevin Pietersen: ప్రతి క్షణం ఆస్వాదించండి.. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు: కెవిన్ పీటర్సన్

Enjoy every moment.. you never know what will happen: Kevin Pietersen

Kevin Pietersen: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంలో 265 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ముఖ్యంగా లైఫ్ లో ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. వీలైనంత ఎక్కువ మందికి ప్రేమను పంచండి అంటూ ఎమోషనల్ పోస్టు చేశాడు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నారు.

Kevin Pietersen: ఈ ఘటన చాలా బాధాకరం

గురువారం అహ్మదాబాద్ (Ahmedabad plane crash) లో జరిగిన విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ స్టూడెంట్స్ మరో 24 మంది దుర్మరణం చెందారు. విమానం టేకాప్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ఇంధనం మండి చుట్టూ పక్కల ప్రాంతాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్లైట్ హాస్టల్ పై కూలడంలో అక్కడ మెస్ లో లంచ్ చేస్తున్న స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు.నిన్న భారత్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి ఎంత ఎక్కువ చదువుతున్నా, వింటున్నా మనసుకు కటువుగానే ఉంటోంది. ఈ ఘటన చాలా బాధాకరం అన్నారు. పీటర్సన్ ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కోచింగ్ సిబ్బందిలో భాగంగా దేశంలో చాలా రోజులు ఉన్నారు. ఈ విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, మొత్తం 242 మందితో ప్రయాణించింది. వీరిలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్‌విక్ విమానాశ్రయానికి బయలుదేరింది.

ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు బతికారు

ఎయిర్ ఇండియా అధికార ప్రకటన ప్రకారం.. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీసు పౌరులు ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా మృతుల్లో ఉన్నారు.ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు బతికారు. విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి, అతను 11A సీట్లో కూర్చున్నాడు. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ అయిన టాటా గ్రూప్, ప్రతి మృతుడి కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం)గా ప్రకటించింది.

Leave a Comment