World Test Championship: మరో 69 పరుగులు చేస్తే 28 ఏళ్ల కల సాకారమైనట్లే

Another 69 runs would make South Africa’s 28-year-old dream come true.

World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ దిశగా సౌతాఫ్రికా జట్టు దూసుకుపోతోంది. మూడో రోజు లంచ్ సెషన్ వరకు ఆస్ట్రేలియాదే పై చేయి అయినప్పటికీ సౌతాఫ్రికా (South Africa Cricket Team) బ్యాటర్లు అడెన్ మార్ క్రమ్, టెంబ భవుమా ఓపికగా, నిలకడగా ఒక్కో పరుగు తీస్తూ కొండంత లక్ష్యాన్ని కరిగించేశారు. నాలుగో రోజు మరో 69 పరుగులు చేస్తే 28 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ దక్షిణాఫ్రికా సొంతమవుతుంది.

కొరకరాని కొయ్యగా..

ఆస్ట్రేలియా (Australia Cricket Team) ఆల్ రౌండర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc), చివరి బ్యాటర్ జోష్ హెజిల్ వుడ్ ఇద్దరూ కొరకరాయని కొయ్యగా మారి చివరి వికెట్ కు 56 పరుగుల పార్ట్ నర్ షిప్ జోడించడంతో సౌతాఫ్రికా ఎదుట ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. టెస్టుల్లో లార్డ్స్ లాంటి బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఈ టార్గెట్ పెద్దదే. కానీ నాలుగో ఇన్సింగ్స్ లో బౌలింగ్ కు అనుకూలిస్తది అనుకున్న పిచ్ కాస్త బ్యాటర్లకు అనుకూలంగా మారడం, దీన్ని సద్వినియోగం చేసుకున్న సౌతాఫ్రికా బ్యాటర్లు, అడెన్ మార్ క్రమ్ (Aden Marcum), టెంబ బవుమా ఇద్దరూ సమయోచితంగా ఆడి ఐసీసీ టైటిల్ గెలిచేందుకు దగ్గరయ్యారు.

World Test Championship: నాలుగో రోజు మొదటి గంట చాలా కీలకం

నాలుగో రోజు మొదటి గంట ఆట చాలా కీలకం ఇప్పటికే బవుమా, మార్ క్రమ్, 143 పరుగుల పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. వీరిద్దరి వికెట్ తీయడానికి ఫ్యాట్ కమిన్స్ బౌలర్లను మార్చి మార్చి వేయించిన ఫలితం లేకుండా పోయింది. స్టీవ్ స్మిత్ బవుమా (Temba Bavuma) క్యాచ్ మిచెల్ స్టార్స్ బౌలింగ్ లో 3 పరుగుల వద్దే మిస్ చేశాడు. ఆ క్యాచ్ గనక తీసుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ముఖ్యంగా క్యాచ్ జారవిడిచినప్పటి నుంచి బవుమా అసలు ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా సాఫీగా, నింపాదిగా ఆడాడు. ప్రస్తుతం 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో బ్యాటర్ అడెన్ మార్ క్రమ్ 102 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లు రాణిస్తే 69 కూడా కష్టమే..

మొదటి రెండు రోజు ఆట గమనిస్తే 69 పరుగులు కూడా కష్టమే అనిపిస్తుంది. వికెట్ పూర్తిగా బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ ఒక్కసారిగా ఈజీగా పరుగులు రావడం మొదలెట్టింది. నాలుగో రోజు ఉదయం ఆసీస్ బౌలర్లు తమ ఫేస్ కు పదునుపెట్టి ఒక్కసారి జూలు విదిల్చితే తప్ప అంతా ఈజీ కాదు. ఎందుకంటే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన సౌతాఫ్రికా (South Africa Cricket Team) పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తోంది. ఇద్దరిలో ఏ ఒక్కరు అవుటైనా మిగతా వారు టార్గెట్ కంప్లీట్ చేసేలా కనిపిస్తున్నారు.

ఇప్పటి వరకు రెండు సార్లు జరిగిన రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (World Test Championship) టైటిళ్లలో ఒక సారి న్యూజిలాండ్, మరో సారి ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మరో సారి ఫైనల్ ఆడుతోంది. ఈ సారి కూడా కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తాడా అని అందరూ అనుకుంటున్నారు. మరి కొన్ని గంటల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది.

Leave a Comment