Ind vs Pak, Playing 11 : ఈ ఒక్క మార్పుతో టీమిండియా బ‌రిలోకి..! పాక్ కాస్కో

Ind vs Pak, Playing 11 : ఈ ఒక్క మార్పుతో టీమిండియా బ‌రిలోకి..! పాక్ కాస్కోఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 23న‌ ఆదివారం దాయాదులైన పాకిస్థాన్, టీమిండియా మ‌ధ్య హైఒల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టీమిండియా శుభారంభం చేయ‌గా పాక్ మాత్రం ఆదిలోనే హంస‌పాదులా.. న్యూజిలాండ్ చేతిలో ఖంగుతింది. బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమీ 5వికెట్లతో, గిల్ సెంచ‌రీతో ద‌డ‌ద‌డ‌లాడించ‌డంతో ఇండియా నిఖార్సైన విజ‌యం సాధించి మంచి ఆత్మ‌విశ్వాసంతో ఉంది. ఇక పాక్ మాత్రం సొంత గ‌డ్డ‌పై కివీస్ చేతిలో చిక్కి కాస్త కంగారుగా ఉంది. ఇక ఆదివారం నాటి మ్యాచ్ ఇరుజ‌ట్ల‌కు చాలా కీల‌కం కానుంది. పాక్ ఓడితే టోర్నీ నుంచి వైదొలిగిన‌ట్లే. పైగా ఆ జ‌ట్టు మంచి నెట్ ర‌న్ రేట్ సాధించి గెల‌వాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇండియాకు ఓడినా మ‌రో ఛాయిస్ ఉంటుంది. కానీ మ‌రో మ్యాచ్ న్యూజిలాండ్ తో కాబ‌ట్టి పాక్ పై గెలిచి సెమీస్ గ‌ట్టుకు చేరితే బెట‌ర్. న్యూజిలాండ్ రన్‌రేట్ ప‌రంగా టేబుల్లో టాప్ 1 గా ఉంది. ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇక ఆదివారం నాటి హైఓల్టేజ్ మ్యాచ్ కు బ‌రిలో దిగే టీమిండియా ఒక‌టి రెండు మార్పులు జ‌రిగే వీలుంది.

బౌలింగే కీల‌కం..

టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ దుర్భేద్యంగా క‌న్పిస్తోంది. కాబ‌ట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఉంటే విజ‌యానికి ఎలా స‌మాయ‌త్తం కావాలో ఓ అంచ‌నాకు రావొచ్చు.. కానీ తొలుత ఇండియా బ్యాటింగ్ చేయాల్సి వ‌స్తే.. మ‌న‌ బౌలింగ్ యూనిట్ పాక్ ఛేద‌న‌ను అడ్డుకోవ‌డంలో కాస్త ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశ‌ముంది. ప్ర‌ధాన పేస‌ర్ బుమ్రా లేక‌పోవ‌డంతో కాస్త వెలితి క‌న్పిస్తుంది. అలాగే లెఫ్టార్మ్ పేస‌ర్ అవ‌స‌ర‌ముంది. ఫ‌లితంగా హ‌ర్షిత్ రానాను ప‌క్క‌న బెట్టి అర్ష‌దీప్ సింగ్ ను తుది జ‌ట్టులో ఉంచే వీలుంది. ఇక స్పిన్ విభాగంలో అక్ష‌ర్, జ‌డ్డూ, కుల్దీప్ ల‌ను కొన‌సాగించే ఛాన్స్ ఉంది. హార్దిక్ ఎలాగూ అయిదారు ఓవ‌ర్లు వేయ‌గ‌ల‌డు. బౌలింగ్లో ఈ మేర‌కు స‌మ‌తూకంతో బ‌రిలో దిగే వీలుంది. ఇక బ్యాటింగ్ లైన‌ప్ య‌థావిధిగా కొన‌సాగ‌డం ఖాయంగా క‌న్పిస్తోంది.

టీమిండియా ప్లేయింగ్ 11 అంచ‌నా..

టాపార్డ‌ర్ – కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, శుభ్ మ‌న్ గిల్, విరాట్ కోహ్లీ
మిడిలార్డ‌ర్ – శ్రేయ‌స్ అయ్యార్, కేఎల్ రాహుల్ (కీప‌ర్),
ఆల్రౌండ‌ర్లు – హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వీంద్ర జ‌డేజా
బౌల‌ర్లు – అర్ష‌దీప్ సింగ్, మ‌హ్మ‌ద్ ష‌మీ, కుల్దీప్ సింగ్

Leave a Comment