Mumbai Indians New Jersey Unveiled: ఇది జెర్సీ కాదు మా హామీ – Hardik Pandya

Mumbai Indians New Jersey Unveiled : ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు తాము సంసిద్ధ‌మ‌ని చాటుతున్న‌ట్లు జెర్సీ విడుద‌ల సంద‌ర్భంగా ఆ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్ప‌ష్టం చేశాడు. ముంబై టీం ఐపీఎల్ చరిత్రలో అత్య‌ధిక సార్లు ట్రోఫీ గెలిచిన జ‌ట్టుగా, అలాగే మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టీంగా పేరొందింది. ఇక ఈసారి సైతం టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ముందు వ‌రుస‌లో ఆ జ‌ట్టు ఉంది. తాజాగా జెర్సీని విడుద‌ల చేసిన సంద‌ర్భంగా టీం త‌న సోషల్ మీడియా హ్యాండిల్లో వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పాండ్యా మాట్లాడుతూ.. 2025లో క‌ప్ కొట్టాల‌ని టీం ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నాడు.

గ‌త ముంబైను చూపించ‌డానికి

గత సీజన్‌ను మరచిపోయి.. కొత్త సీజన్ లో కొత్త అవ‌కాశాల‌ను క‌ల‌గ‌జేసుకుని రాణిస్తామ‌ని.. ముంబై విజ‌య దుందుభిని 2025 సీజ‌న్ ద్వారా తిరిగి తీసుకురావ‌డానికి నీలం-బంగారు రంగులతో కూడిన ఈ జెర్సీ ద్వారా గ్రౌండ్లోకి దిగుతామ‌ని తెలిపాడు. ఇది కేవలం ఒక జెర్సీ కాదు, మీకు మేమిచ్చే హామీ అంటూ స్ప‌ష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడ‌నుంది. చెన్నైలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2024 సీజన్‌లో టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచిన ముంబై మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్ర‌మే గెలిచింది.

image credit X

ముంబై ఇండియన్స్ స్క్వాడ్

హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నామన్ ధీర్, రాబిన్ మిన్జ్, కర్ణ్ శర్మ, రియన్ రికెల్టన్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రహ్మాన్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ శాంట్నర్, రీస్ టోప్లీ, కృష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బావా, సత్యనారాయణ రాజు, బేవోన్ జేకబ్స్, అర్జున్ టెండూల్కర్, లిజాడ్ విలియమ్స్, విగ్నేష్ పుత్తూర్.

Leave a Comment