IPL-2025 RCB: ఆ రెండు కార‌ణాల వ‌ల్లే ఆర్సీబీ కెప్టెన్ గా ర‌జ‌త్ పాటిదార్

ఐపీఎల్లో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న జ‌ట్ల‌లో RCB ఒక‌టి. ఈ జ‌ట్టుకు గ‌తేడాది డుప్లెసిస్ సారథ్యం వ‌హించాడు. అయితే ఈ ఏడాది అత‌న్ని రిటైన్ చేసుకోలేదు. ఫ‌లితంగా టీం కెప్టెన్ ఎవ‌ర‌నేది స‌స్పెన్స్ క్రియేట్ చేసింది. మ‌ళ్లీ కోహ్లీకే ప‌గ్గాలు అందిస్తార‌ని టాక్ న‌డిచింది. అయితే అనూహ్యంగా ర‌జ‌త్ పాటిదార్‌ను కొత్త కెప్టెన్‌గా టీం మేనేజ్మెంట్ ఇటీవ‌ల నియమించింది. అయితే అత‌న్ని ఎంపిక చేయ‌డం ప‌ట్ల ర‌క‌ర‌కాల అభిప్రాయాల‌ను ఫ్యాన్స్ వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రేమో లాంగ్ ర‌న్ లో ఆడే క్రికెట‌ర్ ను ఎంపిక చేయ‌డం టీంకు బెట‌ర‌ని ర‌జ‌త్ ను ఎంచుకున్నారంటే.. మ‌రికొంద‌రేమో అంత బెట‌ర్ ఛాయిస్ కాద‌ని విమ‌ర్శిస్తున్నారు.

అందుకే రిటైన్ చేసుండొచ్చు..

2021లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ర‌జ‌త్ ను ఆర్సీబీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకుంది. అందుకు గాను రూ.11 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీంలో అత‌ని కాన్సిస్టెన్సీ.. దూకుడు మేనేజ్మెంట్ ను ఆలోచ‌న‌లో ప‌డేశాయి. డుప్లెసిస్ ను వదులుకున్నాక‌.. మ‌రో ప్ర‌త్యామ్నాయంగా అత‌న్నే అనుకుని రిటైన్ చేసి ఉండొచ్చ‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది. ఇక అత‌ను కెప్టెన్ గా ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాల్సిందే. ఆర్సీబీ చ‌రిత్ర‌లో 8వ కెప్టెన్ గా అత‌ను రికార్డుకెక్కాడు. అంత‌కుముందు ద్రావిడ్, పీట‌ర్స‌న్, కుంబ్లే, వెటోరీ, విరాట్ కోహ్లీ, వాట్స‌న్, ఫాఫ్ డుప్లెసిస్ టీం సార‌థులుగా న‌డిపించారు.

అదే ట‌ర్నింగ్ పాయింట్

2023 డిసెంబర్ లో సౌతాఫ్రికాతో వ‌న్డే మ్యాచ్ తో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన రజత్.. ఇప్పటివరకు 27 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అత‌ని ఖాతాలో 799 ర‌న్స్ ఉన్నాయి. గ‌త సీజ‌న్లో 395 రన్స్ చేసి టీంలో కీల‌క ప్లేయ‌ర్ గా త‌న స్థానాన్ని భ‌ర్తీ చేసుకున్నాడు. ఇక 2023 సీజ‌న్లో గాయం కార‌ణంగా ఆడ‌లేదు. 2022 సీజ‌న్ ఎలిమినేట‌ర్ మ్యాచ్ ర‌జ‌త్ లైఫ్ ట‌ర్నింగ్ పాయింట్ అనొచ్చు. ఆ మ్యాచ్ లో 49 బాల్స్ లో 112తో చెల‌రేగి ప్లేఆఫ్స్ లో సెంచ‌రీ చేసిన అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ గా నిలిచాడు.

తోటి ప్లేయ‌ర్లు సైతం..

తాజాగా అత‌న్ని సార‌థిగా చేయ‌డం గురించి ఆర్సీబీ మెంటర్ దినేష్ కార్తీక్ ఓ షోలో స్పందించాడు. డొమెస్టిక్ క్రికెట్లో మధ్యప్రదేశ్ జ‌ట్టును పాటిదార్ కెప్టెన్ గా చాలా బాగా నడిపించాడ‌ని, అతని నాయకత్వం గురించి తోటి ప్లేయ‌ర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంద‌ని అందుకే జట్టు యాజమాన్యం అతనికి బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింద‌న్నాడు. మ‌రొక విష‌య‌మేంటంటే న‌యా ప్లేయ‌ర్ల‌తో కూడిన న‌యా జ‌ట్టు మాది. అందువ‌ల్ల కొత్త సార‌థిని నియ‌మించ‌డం బాగుంటుంద‌ని అనుకున్నామ‌ని ఇదో టీం సైకిల్. ఈ రెండింటి ప్ర‌కారం అత‌న్నే కెప్టెన్ చేసిన‌ట్లు వెల్ల‌డించాడు.

Leave a Comment