IPL-2025 పూర్తి షెడ్యూల్‌ను BCCI ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి Sunrisers Hyderabad టీం శత్రుదుర్భేద్యంగా ఉంది. ఒకప్పుడు బౌలింగ్ కు మాత్రమే పేరొందిన సన్ రైజర్స్ గతేడాది తన రూటు పూర్తిగా మార్చింది. బ్యాటింగ్‌లో సంచలన రికార్డులతో ప్రత్యర్థి బౌలర్లను SRH బ్యాటర్లు ఊచకోత కోశారు. ఈసారి క్రికెట్ అభిమానులు ప్రత్యర్థిని గడగడలాడించే SRH మ్యాచ్ ల కోసం ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే టీం బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే ఐపీఎల్ ట్రోఫీకి సైతం SRH మీద పీలింగ్స్ వచ్చుండాల్సిందే.
League: రాయల్స్ తో మొదలు.. జెయింట్స్ తో చివర
IPL-2025లో భాగంగా ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో SRH మార్చి 23న హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తన తొలిగేమ్ ఆడనుంది. ఇక పూర్తి షెడ్యూల్ ను గనుక గమనిస్తే..
మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో మధ్యాహ్నం 3:30, ఉప్పల్ స్టేడియం.
మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్ తో సాయంత్రం 7:30, ఉప్పల్ స్టేడియం,
మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మధ్యాహ్నం 3:30, వైజాగ్‌లోని డా.వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్టేడియం.
ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ తో సాయంత్రం 7:30, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్
ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్ తో సాయంత్రం 7:30, ఉప్పల్ స్టేడియం
ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్ తో సాయంత్రం 7:30, ఉప్పల్ స్టేడియం
ఏప్రిల్ 17న ముంబై ఇండియన్స్ తో సాయంత్రం 7:30, ముంబై వాంఖడే స్టేడియం
ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్ తో సాయంత్రం 7:30, ఉప్పల్ స్టేడియం
ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్ తో సాయంత్రం 7:30, చెన్నై చిదంబరం స్టేడియం
మే 2న గుజరాత్ టైటాన్స్ తో సాయంత్రం 7:30, అహ్మదాబాద్ మోదీ స్టేడియం
మే 5న ఢిల్లీ క్యాపిటల్స్ తో సాయంత్రం 7:30, ఉప్పల్ స్టేడియం
మే 10న కోల్‌కతా నైట్ రైడర్స్ తో సాయంత్రం 7:30, ఉప్పల్ స్టేడియం
మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సాయంత్రం 7:30, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం
మే 18న లక్నో సూపర్ జెయింట్స్ తో సాయంత్రం 7:30, లక్నో ఎకానా స్టేడియం
సన్‌రైజర్స్ హైదరాబాద్ అరివీర భీకరులు
పాట్ కమిన్స్ – కెప్టెన్, ఆల్ రౌండర్
హెన్రిచ్ క్లాసెన్ – వికెట్ కీపర్, బ్యాటర్
అభిషేక్ శర్మ – ఆల్ రౌండర్
ట్రావిస్ హెడ్ – బ్యాటర్
నితీష్ కుమార్ రెడ్డి – ఆల్ రౌండర్
మహ్మద్ షమీ – బౌలర్
హర్షల్ పటేల్ – బౌలర్
ఇషాన్ కిషన్ – వికెట్ కీపర్, బ్యాటర్
రాహుల్ చాహర్ – బౌలర్
ఆడమ్ జంపా – బౌలర్
అధర్వ తైదే – బ్యాటర్
అభినవ్ మనోహర్ – బ్యాటర్
సిమర్జీత్ సింగ్ – బౌలర్
జీషన్ అన్సారీ – బౌలర్
జయదేవ్ ఉనద్కత్ – బౌలర్
బ్రైడన్ కార్సే – ఆల్ రౌండర్
కమిందు మెండిస్ – ఆల్ రౌండర్
అనికేత్ వర్మ – బౌలర్
ఎషాన్ మలింగ – బౌలర్
సచిన్ బేబీ – బ్యాటర్