Top Finishers Of Indian Team: ధోనీని మరిపించేలా.. నయా ఫినిషర్లు దొరికరిలా..! 

Top Finishers Of Indian Team : క్రికెట్‌లో మ్యాచ్‌ను చివరి వరకు నిబద్ధతగా ఆడుతూ జట్టును విజయతీరానికి చేర్చే ఆటగాళ్లను ఫినిషర్లు అంటారు. టీమిండియాకు చాలా మంది గొప్ప ఫినిషర్లు ఉన్నప్పటికీ, వారిలో అత్యుత్తమంగా నిలిచి కొందరు ప్రత్యేకమైన ముద్రవేశారు. మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. అతని ఆటతీరు మిగతా అందరితో పోలిస్తే భిన్నంగా ఉండేది. మ్యాచ్ ఏ స్థితిలో ఉన్నా, ఒత్తిడిని అనుభవించకుండా కూల్‌గా ఉండడం ధోనీ ప్రత్యేకత.  బ్యాటింగ్ చివరి దశలో అతను ఎక్కువగా బంతుల్ని స్టడీ చేసి, ఆఖరి ఓవర్లలో విజృంభించేవాడు. అతని ఫినిషింగ్ నైపుణ్యం 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కనిపించింది.  భారత్ 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ధోనీ 79 బంతుల్లో 91 పరుగులు చేసి శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కులశేఖర వేసిన బౌలింగ్ లో సిక్సు కొట్టి భారత్ కు ట్రోపీ అందించాడు. దీంతో బెస్ట్ ఫినిషర్ గా నిలిచాడు.

Finisher yuvaraj singh

యువీ తక్కువేం కాదు.. 

ధోనీ తర్వాత యువరాజ్ సింగ్ భారత జట్టుకు అత్యుత్తమ ఫినిషర్‌గా నిలిచాడు. అతని అద్భుతమైన హిట్టింగ్ సామర్థ్యం, ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొనే నైపుణ్యం, భారత్‌కు ఎన్నో విజయాలను అందించింది. 2002 నాట్ వెస్ట్  సిరీస్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియాకు  భారీ టార్గెట్ పెట్టింది. టీమిండియా 146/5 స్కోరుతో కష్టమైన స్థితిలో ఉండగా యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్‌తో కలిసి మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి క్రికెట్ చరిత్రలో అజేయమైన రికార్డు సృష్టించాడు.

ఛేజింగ్ మాస్టర్.. కోహ్లీ

ఫినిషర్లలో విరాట్ కోహ్లీ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఛేజింగ్ మాస్టర్ అనే పేరు పొందిన కోహ్లీ, లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యుత్తమమైన రికార్డు కలిగి ఉన్నాడు. ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన 82(51) ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులకు మరపురాని జ్ఞాపకం. కఠినమైన పరిస్థితుల్లోనూ కోహ్లీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, షాట్లను కచ్చితంగా ఆడుతూ జట్టును విజయతీరానికి చేర్చడం అతని ప్రత్యేకత.

ఇప్పుడు హర్దిక్, కేఎల్ రాహుల్ పైనే చూపు.. 

ప్రస్తుతం టీం ఇండియాకు ఇద్దరు ఫినిషర్లున్నారు. వారే కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యా. వీరిద్దరూ కలిసి ఆరో, ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతూ.. విలువైన 30 నుంచి 40 పరుగులు చేస్తున్నారు. ధోనీ లాంటి పాత్ర పోషించడానికి కేఎల్ రాహుల్ సిద్ధమయ్యాడు. క్రీజులో కుదురుకుని చివరి వరకు ఉండి మ్యాచులను గెలిపిస్తున్నాడు. హర్దిక్ పాండ్యా ఒత్తిడి సమయంలో దంచి కొట్టి ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోపీలో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లు పడిన తర్వాత ఆడిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో భారత్ కు నయా ఫినిషర్లు దొరికారని భారత క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు. 

హిట్టింగ్ పాండ్యా

హార్దిక్ పాండ్యా అత్యుత్తమ ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు. అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యం, ముఖ్యంగా చివరి ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే తీరు, టీమిండియాకు కొత్తదనాన్ని తీసుకువచ్చింది. భారత క్రికెట్‌లో “అత్యుత్తమ ఫినిషర్” గా ఎంఎస్ ధోనీ పేరు తొలిస్థానంలో ఉంటే, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు ఈ విభాగంలో తమదైన ముద్రవేశారు. కానీ ‘ఫినిషింగ్ ఆర్ట్’ లో ధోనీ చూపిన స్టైల్, స్థిరత్వం, ఇప్పటికీ గొప్పగానే ఉంటుంది.

Leave a Comment