Why Rahane as KKR Captain: ఆ కోణంలో ఆలోచించి సారథిగా రహానే..

Why Rahane as KKR Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మార్చి 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లకు కెప్టెన్లను ఆయా టీం మేనేజ్మెంట్లు ప్రకటించాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ టీం కెప్టెన్ గా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేను ఆ టీం మేనేజ్మెంట్ ఖరారు చేసింది. వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యార్ ను నియమించింది. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళ పరంగా రింకు సింగ్‌కు సారథి బాధ్యత అప్పగిస్తారని అనిపించింది. మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్‌ను భారీ ధరకు కొనుగోలు చేయడంతో అతనే కెప్టెన్ అని దాదాపు అంత ఫిక్స్ అయ్యారు. తాజాగా అజింక్య రహానేకు కేకేఆర్ కెప్టెన్సీ అప్పగించి అందరి అంచనాలను తారుమారు చేసింది. గత సీజన్‌లో కేకేఆర్‌ సారథిగా శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అయితే కేకేఆర్ అతన్ని వేలంలో వదులుకుంది. అతన్ని రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసి ఆ జట్టుకు కెప్టెన్ గా నియమించింది.

image credit : X

Rahane as KKR Captain: మూడు నినాదాలతో జెర్సీ

కేకేఆర్ తాజా ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా అన్ని టీంల కెప్టెన్లు ఖరారైన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరిని కెప్టెన్‌ చేసే వీలుంది. ఇకపోతే కేకేఆర్ ఐపీఎల్ 2025 సీజన్‌ కెప్టెన్ విషయంతో పాటు తమ న్యూ జెర్సీని కూడా రివీల్ చేసింది. ఇప్పటివరకు మూడు సార్లు ఆ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ విషయాన్ని రిప్రజెంట్ చేసేలా జెర్సీ మీద మూడు స్టార్లు ఉంచారు. అలాగే మూడు నినాదాలు కర్చో, లోర్చో, జీత్చో అంటూ కాప్షన్ ఇచ్చారు. వీటికి ప్రదర్శన, సమరం, గెలుపు అని అర్థాలు.

ఇది రెండోసారి..

రహానే కేకేఆర్ తరపున ఆడడం ఇది రెండోసారి. 2022లో అతను కేకేఆర్ తరపున ఆడి 103.90 స్ట్రైక్ రేటుతో 7 మ్యాచ్‌లలో 133 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత రహానే చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడాడు. 2023లో చెన్నై తరపున 172.48 స్ట్రైక్ రేటుతో 326 పరుగులు, 2024లో 123.46 స్ట్రైక్ రేటుతో 242 పరుగులు చేశాడు. ఇక అతన్ని 2025 మెగా వేలం ముందు CSK వదులుకుంది. ఇక వేలంలో రహానే పట్ల ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. KKR బేస్ ధర రూ.1.50 కోట్లకు అతన్ని దక్కించుకుంది. 

అందుకే సారథిగా.. 

రహానేకు కెప్టెన్ గా మంచి అనుభవం ఉంది. అతను టీమిండియాకు 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ భారత్ గెలిచింది. అలాగే డొమెస్టిక్ క్రికెట్లో ముంబై టీంకు కెప్టెన్ గా మంచి విజయాలు అందించాడు. ఇటీవల 2024-25 సయ్యద్ ముష్తాక్ అలి ట్రోఫీలో 164.56 స్ట్రైక్ రేటుతో 58 సగటుతో 469 పరుగులు చేసి మంచి ఫామ్ అందుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో కూడా అతనికి కెప్టెన్ గా అనుభవం ఉంది. అతను 2017లో రైజింగ్ పుణే సూపర్ జయంట్స్, 2018-19లో రాజస్థాన్ రాయల్స్ తరపున సారథిగా వ్యవహరించాడు. దీంతో అనుభవం దృష్ట్యా అతన్ని కేకేఆర్ కెప్టెన్ గా నియమించినట్లు తెలుస్తోంది. 

KKR IPL 2025 Team

Retained Players: రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణా, రమందీప్ సింగ్

వేలంలో కొన్న ప్లేయర్స్: వెంకటేష్ అయ్యర్ (రూ.23.75 కోట్లు), క్వింటన్ డికాక్ (రూ.3.60 కోట్లు), రహ్మానుల్లా గర్బాజ్ (రూ.2 కోట్లు), నోకియా (రూ.6.50 కోట్లు), ఆంగ్‌కృష్ణ రఘువంశీ (రూ.3 కోట్లు), వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు), మయాంక్ మార్కాండే (రూ.30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు), మనీష్ పాండే (రూ.75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ.2.80కోట్లు), లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), అజింక్య రహానే (రూ. 1.50 కోట్లు), అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు), మొయీన్ అలీ (రూ. 2 కోట్లు), ఉమ్రాన్ మలిక్ (రూ. 75 లక్షలు).


Leave a Comment